Adipurush Graphics Cost : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం.. ఆది పురుష్. ఇందులో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. రామాయణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అయితే ఈ మూవీపై ప్రస్తుతం భారీ ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ మూవీని చాలా మంది విమర్శిస్తున్నారు. బాయ్‌కాట్ చేయాలని హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో చిత్ర మేకర్స్‌కు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఆది పురుష్ సినిమాకు గాను మొత్తం రూ.500 కోట్ల బడ్జెట్ అని సమాచారం. కానీ అందులో సగం మేర.. అంటే.. రూ.250 కోట్లను కేవలం గ్రాఫిక్స్ కోసమే ఖర్చు చేస్తున్నారట. ఈ క్రమంలోనే గ్రాఫిక్స్ పరమ చెత్తగా ఉండడంతో అన్ని వందల కోట్లు వృథా అయినట్లే అని అంటున్నారు.

ఇక ఆది పురుష్ టీజర్ తరువాత సినీ ప్రేక్షకులే కాదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే సినిమా హిట్ అవుతుందా.. అంటే.. అందుకు కాదనే సమాధానం వినిపిస్తోంది. ఈ మూవీ ఫెయిల్ అయ్యే చాన్సులే అధికంగా ఉన్నాయని అంటున్నారు. అయితే గ్రాఫిక్స్‌ను ఇప్పటికప్పుడు మార్చలేరు. మళ్లీ మొదట్నుంచీ రావాలి. కానీ కొన్ని మెరుగులు అద్దే అవకాశం మాత్రం ఉంది. అయినప్పటికీ మూవీ అవుట్‌పుట్ ఎలా వస్తుందన్నదే సందేహంగా మారింది. మరి ప్రభాస్ ఆదిపురుష్ మూవీ హిట్ అవుతుందా.. లేక మరో డిజాస్టర్ అవుతుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.