సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది అనే విషయం ఎవరికీ తెలియదు.కొందరు జీవితం ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సంతోషంగా సాగిపోతే మరికొందరి జీవితం ఎన్నో కష్టాల సుడిగుండంలోకి పడుతుంది. అత్తింటివారి పెట్టే బాధలను భరించలేక అమ్మాయి ఎంతో నలిగిపోతుంది. అచ్చం ఇలాగే పెళ్లి తర్వాత అదనపు కట్నం తేవాలని కోడలిని నానా చిత్రహింసలకు గురి చేసి ఎనిమిది నెలలుగా ఒక గదిలోనే బంధించిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని సుపౌల్‌లో జిల్లాలోని కిసాన్‌పూర్‌కు చెందిన విక్రమ్ చౌదరి కుమారుడు సంజయ్ చౌదరికి ఢిల్లీలోని నోయిడాకు చెందిన మోనా అనే యువతితో మూడు సంవత్సరాల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మోనా తండ్రి వరుడికి ఒక కారు, 17 లక్షలను లాంఛనంగా ఇచ్చారు. ప్రస్తుతం మోన కుటుంబం కిసాన్‌పూర్‌లో నివసిస్తున్నారు. వీరికి ఒక ఏడాది పాప కూడా ఉంది.
తాజాగా తన అత్తింటివారు తనను పుట్టింటి నుంచి అదనంగా మరో పది లక్షలు కట్నం తేవాలని ఆమెను వేధించడం మొదలు పెట్టారు.అత్తింటి వారు డిమాండ్ చేసిన కట్నం తీసుకురా కాకపోవడంతో ఆమెను గత ఎనిమిది నెలల నుంచి ఒకే గదిలో బందీగా చేసి నానా హింసలకు గురి చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు వెంటనేమహిళా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆమెకు విముక్తి కల్పించారు.బాధితురాలి వాంగ్మూలం ప్రకారం అదనపు కట్నం కోసమే తనను వేధిస్తున్నారని ఈ క్రమంలోనే తన భర్త, అత్తమామలు, ఆడపడుచుల పై కేసును నమోదు చేసుకున్నారు.