స్వీట్స్ అంటే ఎంతో ఇష్టంగా తినే వారికి ఎంత తొందరగా రుచికరంగా తయారుచేసుకొనే వాటిలో కాజు కత్లీ ఒకటి. మరి ఎంతో తొందరగా తయారుచేసుకొనే స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*పాలపొడి అరకప్పు
*పంచదార అర కప్పు
*నెయ్యి టేబుల్ స్పూన్
*పాలు అర కప్పు
*జీడి పప్పు ఒక కప్పు
*ఏలకులు 4
తయారీ విధానం
ముందుగా పాలను బాగా మరిగించి వాటిని చల్లార బెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పును మిక్సీలో వేసుకుని మెత్తని పొడి లాగా చేసుకోవాలి.జీడిపప్పును ఒకేసారి మిక్సీలో వేయటం వల్ల ముద్దగా తయారయి జీడిపప్పు నుంచి నూనె బయటకు వస్తుంది కనుక జీడిపప్పును మిక్సీలో వేసేటప్పుడు ఆగి ఆగి వేసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలోకి పంచదార ఏలకులపొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని జీడిపప్పు మిశ్రమంలో వేసుకుని బాగా కలపాలి. ఇందులోకి పాలపొడి వేసి కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ చపాతి పిండిలా తయారు చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ తీసుకుని ఒకదానిపై నూనె వేసుకొని బటర్ పేపర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈ బటర్ పేపర్ పై జీడిపప్పు ముద్దను పెట్టి మరొక బటర్ పేపర్ పెట్టి చపాతి కర్ర సహాయంతో చపాతి ఆకారంలో తయారు చేసుకోవాలి. ఈ విధంగా చపాతి ఆకారంలోకి వచ్చిన తర్వాత వీటిని డైమండ్ షేప్ లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.