Youtube Shorts : ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌కు చెందిన యూట్యూబ్ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో చాలా మంది వీడియోలను అప్లోడ్ చేస్తూ తమ చానల్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. అయితే తాజాగా యూట్యూబ్‌లోనే మరో కొత్త అవకాశాన్ని గూగుల్ అందిస్తోంది. అదేమిటంటే.. యూట్యూబ్‌లో ఉన్న షార్ట్స్ అనే ఫీచర్ సహాయంతో నెటిజన్లు డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ అవకాశాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చామని గూగుల్ వెల్లడించింది.
యూట్యూబ్‌లో ఉన్న షార్ట్స్ అనే ఫీచర్ సహాయంతో యూజర్లు డబ్బు సంపాదించవచ్చు. అందుకు గాను వారు షార్ట్స్ రూపంలో వీడియోలను అప్ లోడ్ చేయాలి. వాటికి వ్యూస్ రావాలి. అలాగే షార్ట్స్ వీడియోలను అప్లోడ్ చేసే చానల్‌కు తగినంత మంది సబ్స్క్రైబర్లు కూడా ఉండాలి. ఈ క్రమంలోనే చానల్‌కు కనీసం 1000 మంది సబ్స్క్రైబర్లు ఉండడంతోపాటు వీడియోలను 4000 గంటలు చూసి ఉండాలి. అలాగే షార్ట్స్ వీడియోలకు కనీసం 1 కోటి వ్యూస్ వచ్చి ఉండాలి. అలాంటి వారు ఈ కొత్త సదుపాయంతో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను గూగుల్ లేటెస్ట్గా తన యూట్యూబ్‌లో అందిస్తోంది. కనుక మరిన్ని వివరాలను యూట్యూబ్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

ఇక గూగుల్ తన షార్ట్స్ ఫీచర్‌ను ఇప్పటికే అందుబాటులో ఉంటుంది. మన దేశంలో టిక్ టాక్ బ్యాన్ అనంతరం పుట్టుకొచ్చిన యాప్‌లలో ఇలాగే వీడియోలను అప్ లోడ్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే యూట్యూబ్‌లో తెచ్చిన షార్ట్స్ ఫీచర్ కూడా అలాంటిదే. కానీ ఇలాంటి షార్ట్ వీడియోలతో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని మాత్రం తొలిసారిగా గూగుల్ అందిస్తుండడం విశేషం. మరింకెందుకాలస్యం.. మీరు కూడా షార్ట్స్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటే.. ఇకపై వాటితో ఎంచక్కా డబ్బులు సంపాదించవచ్చు. త్వర పడండి మరి..!