పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలు అవతరించాడు అని మనకు తెలుసు. ఒక్కో అవతారంలో ఒక్కో పేరుతో పూజలందుకున్న శ్రీహరిని విష్ణుమూర్తి, నారాయణుడు అనే పేర్లతో పిలుస్తారు. ఈ విధంగా విష్ణు దేవుడిని నారాయణుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం.
విష్ణుదేవుడు లోకకల్యాణార్థం దశావతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసి, ధర్మం వైపు నిలబడ్డాడు. అందుకోసమే వివిధ అవతారాలలో విష్ణుమూర్తి భక్తులకు దర్శనమిచ్చాడు.ఇకపోతే స్వామివారికి నారాయణుడు అనే పేరు రావడానికి గల కారణం ఏమిటంటే… ఈ సమస్త విశ్వంలో ప్రతి ఒక్క ప్రాణికోటికి అవసరమయ్యేది నీరు. నీరు లేకపోతే భూమిపై ఏ ప్రాణి నిలవదు.
విష్ణుమూర్తిని నారాయణుడు అనే పేరు పిలవడానికి గల కారణం నారాయణుడులో నారము అంటే నీరు, ఆయణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే సమస్త ప్రాణికోటికి నీటిని అందించేవాడు కనుక విష్ణుమూర్తిని నారాయణుడు అనే పేరుతో పూజిస్తారు. అదేవిధంగా పవిత్రమైన గంగా జలం ఉద్భవించినది కూడా విష్ణుమూర్తి పాదాల చెంతనే, అలాగే విష్ణుమూర్తి ఎల్లప్పుడూ నీటిపై శయనించడం వల్ల శ్రీహరిని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు.