తక్కువ ధరకే ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను అందించడంలో వన్ ప్లస్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు బడ్జెట్ మిడ్‌రేంజ్ ఫోన్లను వన్‌ప్లస్ విడుదల చేస్తుంటుంది. ఇక తాజాగా అలాంటిదే మరొక స్మార్ట్ ఫోన్‌ను వన్‌ప్లస్ భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులోని ఫీచర్లు ఎలా ఉన్నాయో, దీని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
వన్‌ప్లస్ సంస్థ కొత్తగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జి పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఫ్లుయిడ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. దీని వల్ల డిస్‌ప్లే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ డిస్‌ప్లే 1080 x 2400 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది.
ఈ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 750జి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 6, 8, 12 జీబీ ర్యామ్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తోంది. అలాగే 128, 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు లభిస్తున్నాయి. మెమొరీని పెంచుకునే అవకాశం లేదు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఇందులో లభిస్తుంది. డ్యుయల్ సిమ్ వేసుకోవచ్చు.
ఈ ఫోన్‌లో వెనుక వైపు 64, 8, 2 మెగాపిక్సల్ కెమెరాలు 3 ఉండగా, ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. 5జికి సపోర్ట్ ఉంది. డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ ఫీచర్ లభిస్తుంది. బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ఫీచర్లు ఉన్నాయి. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి వార్ప్ చార్జ్ ఫీచర్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ 30 నిమిషాల్లోనే 70 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
- వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జి ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.22,999.
- 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.24,999.
- 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999.
జూన్ 16 నుంచి అమెజాన్, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ లభిస్తుంది.