ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. కాయ్ ఓఎస్‌ను వాడుతున్న యూజర్లకు శుభవార్త చెప్పింది. ఆ ఓఎస్‌లో వాట్సాప్‌కు వాయిస్ కాల్స్ ఫీచర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. కాయ్ ఓఎస్ జియో ఫీచర్ ఫోన్లతోపాటు పలు నోకియా ఫీచర్ ఫోన్లలో అందుబాటులో ఉంది. అందువల్ల ఆయా ఫోన్లను వాడుతున్న వారు తమ వాట్సాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. దీంతో వాట్సాప్‌లో వాయిస్ కాల్స్ ఫీచర్‌ను పొందవచ్చు.
కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో వాట్సాప్ లో ఇప్పటికే వాయిస్ కాల్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే కాయ్ ఓఎస్ వాడుతున్న వారికి కూడా ఈ సదుపాయాన్ని వాట్సాప్ అందిస్తోంది. కాయ్ ఓఎస్ ఉన్న ఫీచర్ ఫోన్లలో 512 ఎంబీకి పైగా ర్యామ్ ఉంటే వారు తమ వాట్సాప్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. దీంతో వాట్సాప్ లో వాయిస్ కాల్స్ ఫీచర్ లభిస్తుంది.
కాగా 4జీ ఫీచర్ ఫోన్ల మార్కెట్‌లో జియో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఆ కంపెనీకి చెందిన రెండు రకాల ఫీచర్ ఫోన్లలో 4జి సదుపాయం లభిస్తోంది. వాటితోపాటు కొన్ని నోకియా ఫోన్లలోనూ కాయ్ ఓఎస్ ఉంది. దీంతో వారు వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు.