చాలా మంది వివిధ రకాల హల్వాలు తయారు చేసుకుని తింటారు. అయితే వీటన్నింటిలో కల్ల ఎంతో ఇష్టంగా తినేది క్యారెట్ హల్వా. చిన్న పిల్లలకు కూడా క్యారెట్ హల్వాను ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*క్యారెట్ తురుము ఒక కప్పు
*చక్కెర అర కప్పు
*నెయ్యి ఒక చిన్న గ్లాసు
*జీడిపప్పు, క్రిస్ మిస్ కొద్దిగా
*నీరు కొన్ని
తయారీ విధానం
ముందుగా క్యారెట్ ను శుభ్రం చేసి తురిమి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి ఉంచి అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి జీడిపప్పు, క్రిస్ మిస్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలోకి మరికొంచెం నూనె వేసి క్యారెట్ తురుము వేయాలి. క్యారెట్ తురుమును అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా మెత్తగా ఉడికించాలి. అవసరం అనుకుంటే ఒక చిన్న గ్లాసు నీటిని వేసి మూతపెట్టి క్యారెట్ ను బాగా మెత్తగా ఉడికించాలి. నీళ్లు లేకుండా బాగా ఉడికిన క్యారెట్ తురుములోకి చక్కెర వేసి కలియబెడతూ ఉండాలి. తక్కువ మంటపై ఈ విధంగా చక్కెర మొత్తం కరిగి బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా రెండు కలిసిన తర్వాత అవసరం అనుకుంటే మరొక రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా నెయ్యి ఎక్కువ పడితేనే హల్వా రుచిగా ఉంటుంది. తరువాత దీనిలోకి ముందుగా వేయించి పెట్టుకున్న బాదం, కిస్ మిస్ వేసుకుంటే ఎంతో రుచికరమైన హల్వా తయారైనట్టే. ఈ హల్వాను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.