వెండితెరపై ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించి రియల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో దానధర్మాలను,మంచి పనులను చేస్తూ అందరి మన్ననలను పొందిన స్వర్గీయ శ్రీహరి జీవితంలో డిస్కోశాంతి ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అప్పట్లో ఓ సంచలనం గా మారింది.
ఎన్నో సినిమాలలో నటుడిగా విలక్షణ నటుడిగా నటించిన శ్రీహరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది.తాను బతికి ఉన్నప్పుడు తన ద్వారా ఎంతో లబ్ధి పొందిన వారు తన మరణానంతరం తన కుటుంబానికి ఏమాత్రం సహాయం చేయడానికి ముందుకు రాలేదని ఎన్నో సందర్భాలలో తన భార్య డిస్కోశాంతి ఎమోషనల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 30 ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృధ్విరాజ్ నటుడు శ్రీహరి గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చిన బెనర్జీ, పృథ్వీ, జ్యోతి, సుదర్శన్ షోలో భాగంగా స్వర్గీయ శ్రీహరి, ఉదయ్ కిరణ్ గురించి తలుచుకున్నారు. ఈ క్రమంలోనే కమెడియన్ పృథ్వి రాజ్ శ్రీహరి గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీహరి ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి అని ఆయన గొప్పతనం గురించి తెలియజేస్తూ శ్రీహరి నివాసం ఉంటున్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఇంటిలో ఉన్నప్పుడు తన ఇంటి ముందు ఎవరైనా నిలబడి కనిపిస్తే చాలు.. వెంటనే శ్రీహరి రాయికి డబ్బులు చుట్టి బాల్కనీలో నుంచి విసిరేవారు. ఆ డబ్బులు తీసుకున్న వారు ఆయనకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ఎంతోమందికి ఎంతో సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తి శ్రీహరి అని ఆయన గురించి తలచుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా వీరిమధ్య జరిగిన సరదా సన్నివేశాలకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.