చాక్లెట్స్ అంటే చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఇంట్లోనే ఎంతో రుచికరమైన పిల్లలకు ఎంతో ఇష్టమైన చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
*చాక్లెట్ స్పాంజ్ 1
*డైజెస్టివ్ బిస్కెట్స్ 2
*విప్పేడ్ క్రీమ్ 3 టేబుల్ స్పూన్లు
*చాక్లెట్ సాస్ అర కప్పు
*చాక్లెట్ చిప్స్ తగినంత
*స్ప్రింకిల్స్
*లాలీపాప్ స్టిక్స్ కొన్ని
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలోకి చాక్లెట్ స్పాంజ్ తీసుకొని పొడిగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి బిస్కెట్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలోకి కొద్దిగా విప్పేడ్ క్రీమ్ కలుపుతూ ఈ మిశ్రమాన్ని మెత్తని ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.ఒక మూడు నిమిషాల పాటు ఆరిన తర్వాత లాలీపాప్ స్టిక్స్ తీసుకొని వాటిని చాక్లెట్ సాస్ లో ముంచి ఒక్కో బాల్ కు ఒక స్టిక్ అమర్చాలి.తరువాత ఈ లాలీపాప్ ను ఒక గంట పాటు ఫ్రిజ్లో ఉంచి తరువాత వీటిని తీసుకుని చాక్లెట్ సాస్ లో నుంచి దానిపై స్ప్రింకిల్స్, చాక్లెట్ చిప్స్ చల్లి సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు.