Vikram Movie : యూనివర్సల్ స్టార్‌గా ఎంతో పేరుగాంచిన కమలహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఎప్పటికప్పుడు భిన్న తరహా చిత్రాలను చేయడంలో ఈయన ఇతర హీరోల కన్నా ముందే ఉంటారు. ఇక ఈయన నటించిన విక్రమ్ మూవీ ఇటీవలే విడుదల కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను కొల్లగొడుతోంది. కమలహాసన్ సినిమా కెరీర్లోనే ఈ మూవీ అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీగా రికార్డులను బ్రేక్ చేస్తోంది.
విక్రమ్ మూవీలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్, సూర్యలు కీలకపాత్రల్లో కనిపించారు. వీరి రోల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే యాక్షన్ డ్రామాగా లోకేష్ కనగరాజ్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే విక్రమ్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

విక్రమ్ మూవీ జూన్ 3వ తేదీన రిలీజ్ కాగా.. జూలై 3 తరువాత ఓటీటీల్లోకి రానుంది. అయితే ఈ సినిమాకు గాను డిజిటల్ హక్కులను ఎవరు కొనుగోలు చేసింది ఇంకా వివరాలను వెల్లడించలేదు. కానీ జూలై 8వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఈ మూవీ ఇంకా ప్రదర్శించబడుతూనే ఉంది.