టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ వారసుడిగా అఖీరా నందన్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కానీ ఏ సందర్భంలోనైనా అకీరా ఫోటోలు కనబడితే చాలు సోషల్ మీడియాలో తెలుగు వైరల్ అవుతుంటాయి.
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కొడుకు అకిరా నందన్ తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు తండ్రి కొడుకులిద్దరిని ఈ విధంగా చూసి తెగ సంబరపడిపోతున్నారు. ఈ విధంగా తమ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ ఫోటోలు బయటకు రావడంతో పరమ భక్తుడు బండ్ల గణేష్ ఊరుకుంటారా? తన స్టైల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న భక్తిని మరోసారి చాటుకున్నారు.
పవన్ కళ్యాణ్ అకీరానందన్ ఫోటో పై బండ్ల గణేష్ స్పందిస్తూ….”నా దేవుడితో… నా హీరో అంటూ” కామెంట్ చేశారు. ఈ విధంగా బండ్ల గణేష్ దేవుడంటే పవన్ కళ్యాణ్.. ఇక పైకి అకీరాను ఉద్దేశించి నా హీరో అనగా ప్రస్తుతం అకీరానందన్ సినిమా ఎంట్రీ పై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అకీరానందన్ హీరోగా బండ్ల గణేష్ లాంచ్ చేయనున్నారు అనే సందేహాలు కూడా తలెత్తడంతో నెటిజన్లు అయోమయంలో పడ్డారు. మరికొందరు మాత్రం అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని పరోక్షంగానే చెప్పావా బండ్లన్న అంటూ కామెంట్ చేస్తున్నారు.