Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటి వరకు చెప్పిన జాతకాలు, జ్యోతిష్యాలు ఎన్నో నిజమయ్యాయి. దీంతో ఈయన చెప్పే విషయాలపై చాలా మందికి నమ్మకం ఏర్పడింది. గతంలో జగన్ సీఎం అవుతారని ఈయన చెప్పారు. అన్నట్లే జగన్ సీఎం అయ్యారు. తరువాత సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పారు. అలాగే జరిగింది. ఆ తరువాత ప్రభాస్‌కు ఈ ఏడాదిలో పెళ్లి అవుతుందని వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. అయితే ఇది ఇంకా జరగలేదు.. కానీ ప్రభాస్ పెళ్లి కన్‌ఫామ్ అవుతుందని ఈ మధ్యే వార్తలు వచ్చాయి. ఇలా ఎంతో మంది సెలబ్రిటీల జాతకాలు చెప్పిన వేణు స్వామి బాగా పాపులర్ అయ్యారు. అయితే ఈయన తాజా ఓ ఇద్దరు సెలబ్రిటీలకు చెందిన జాతకాలు చూసి.. వారు విడిపోతారని చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకీ అసలు ఆ సెలబ్రిటీ జంట ఎవరంటే..
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది పినిశెట్టి ఈ మధ్యే నిక్కీ గల్రానిని వివాహం చేసుకున్న విషయం విదితమే. కన్నడ నటి సంజన గల్రానీ సోదరి ఈమె. పలు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఈమె నటించింది. అయితే ఆది, నిక్కీ ఇద్దరూ ఓ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. తరువాత వారి ప్రేమ కొన్నేళ్లపాటు కొనసాగింది. ఈ క్రమంలోనే వారు ప్రేమ బంధానికి స్వస్తి చెప్పి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి జాతకాలు సరిపోలేదని.. వీరు వివాహం చేసుకున్నప్పటికీ కొంతకాలం అయ్యాక విడిపోతారని.. వేణు స్వామి జోస్యం చెప్పారు.

ఆది, నిక్కీ ఇద్దరూ ప్రేమ వ్యామోహంలో పడి వివాహం చేసుకున్నారని.. అయితే జాతకరీత్యా వారికి అసలు వివాహ బంధం అచ్చిరాదని.. వారు విడిపోతారని.. వేణు స్వామి జ్యోతిష్యం చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో సమంత, చైతన్య విడిపోతారని ఈయన ముందే చెప్పారు. అలాగే ఆయన చెప్పినట్లే జరిగింది. దీంతో ఆయన జ్యోతిష్యంపై చాలా మందికి గురి కుదిరింది. ఇక ఇప్పుడు ఆది, నిక్కీ ఇద్దరూ విడిపోతారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ సారి ఆయన జ్యోతిష్యం ఏమవుతుందో చూడాలి.