Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం ఎంతటి ఫ్లాప్‌ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిందే. ఈ మూవీకి దాదాపు 2 నుంచి 3 ఏళ్ల సమయం కేటాయించారు. పలు కారణాల వల్ల అనేక సార్లు సినిమా విడుదలను వాయిదా వేశారు. అయితే సమయం ఎక్కువగా తీసుకుంటున్నారు కనుక మూవీ బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ వారికి భంగపాటు ఎదురైంది. సినిమా విడుదల రోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూటగట్టుకుంది. మెగాస్టార్ సినిమా అంటే మొదటి వారం రోజుల పాటు అసలు ఏ థియేటర్‌లోనూ టిక్కెట్లు లభించవు. కానీ ఆచార్యకు మాత్రం తొలి రోజే అనేక థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. సినిమా ఎంతటి ఫ్లాప్‌ను మూటగట్టుకుందో. అయితే ఈ మూవీ ఇటీవల ఓటీటీలోనూ రిలీజ్ అయింది. కానీ ఆ ప్లాట్‌ఫామ్‌పై కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు.
ఆచార్య మూవీకి ఓటీటీలోనూ వ్యూస్ రావడం లేదట. ఈ మూవీ పట్ల ప్రేక్షకులు ఆసక్తిని చూపించడం లేదట. దీంతో ఓటీటీలోనూ ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది. సాధారణంగా థియేటర్లలో ఫెయిల్ అయిన చాలా సినిమాలు ఓటీటీలో హిట్ అయ్యాయి. కానీ ఆచార్య విషయంలో మాత్రం అలా జరగలేదు. ప్రేక్షకులు ఈ మూవీని చూసేందుకు అసలు ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదట. దీంతో మెగా ఫ్యాన్స్ మళ్లీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాలు రానున్న రోజుల్లో వరుసగా రిలీజ్ కానున్నాయి. కనుక వాటిల్లో ఏ ఒక్క మూవీ హిట్ అయినా కూడా ఫ్యాన్స్ మళ్లీ పండగ చేసుకుంటారు. ఇక ఆ రోజుల కోసం వారు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు.

ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గాడ్ ఫాదర్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తరువాత భోళాశంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఆచార్య ఫ్లాప్ నేపథ్యంలో రానున్న చిరంజీవి సినిమాలు ఎలాంటి ప్రదర్శన ఇస్తాయోనని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి వారి దాహం తీరుతుందో.. లేదో.. చూడాలి.