Movie Review Laxman : ఆయన కెమెరా ముందు నిలుచుని మైక్ ఎదురుగా పెట్టుకుని సినిమాలకు రివ్యూలు ఇస్తుంటే.. ఎవరైనా సరే పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే. అవును.. ఈ పాటికే ఆయన ఎవరో మీకు గుర్తుకు వచ్చే ఉంటుంది. యెస్.. ఆయనే రివ్యూయర్ లక్ష్మణ్. ఈయన యూట్యూబ్‌లో బాగా పాపులర్. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలను చూసేవారికి ఈయన గురించి బాగానే తెలుసు. అయితే విశ్వక్‌సేన్ చేసిన ప్రాంక్ వీడియోలో నటించినందుకు గాను రివ్యూయర్ లక్ష్మణ్ అంటే ఎవరో తెలియని వారికి కూడా తెలిసిపోయింది. ఈయన ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
విశ్వక్‌సేన్ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీకి అంత హైప్, పబ్లిసిటీ రాకపోయేది. కానీ విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో కారణంగా ఓ టీవీ చానల్‌లో యాంకర్ దేవి డిబేట్ పెట్టడం.. తరువాత ఆమె విశ్వక్ సేన్‌ను తిట్టడం.. వంటి సంఘటనల కారణంగా విశ్వక్‌కు సానుభూతి వచ్చింది. నెటిజన్లందరూ దేవినే తప్పుబట్టారు. ఈ క్రమంలోనే అశోకవనంలో సినిమాకు కూడా కావల్సినంత పబ్లిసిటీ లభించింది. అయితే దీని వల్ల రివ్యూయర్ లక్ష్మణ్ కూడా పాపులర్ అయ్యారు. అంతకు ముందు కేవలం యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఈయన ఇప్పుడు అందరికీ పరిచయం అయ్యారు. ఇక తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రివ్యూలు చెప్పే సమయంలో ఓవర్ యాక్షన్ చేస్తానని అందరూ అనుకుంటారని.. కానీ అది నిజం కాదని.. సినిమా గురించి తాను ఏం ఫీలైతే అదే చేసి చూపిస్తానని.. కనుక రివ్యూ చెప్పే సమయంలో తన హావభావాలు, ఓవర్ యాక్షన్ అంతా డూప్ కాదని.. నిజమే అని అన్నారు. అలాగే ఇంకొన్ని విషయాలను కూడా వెల్లడించారు.
![Movie Review Laxman : రివ్యూయర్ లక్ష్మణ్.. రివ్యూలు చెప్పేటప్పుడు చేసే యాక్షన్.. నిజమా.. అబద్ధమా..? Movie Review Laxman is he acting or it is dupe](https://i0.wp.com/indiadailylive.com//wp-content/uploads/2022/05/movie-review-laxman.jpg?resize=1200%2C682&ssl=1)
రివ్యూలు చెప్పేందుకు తన ఎవరూ డబ్బులు ఇవ్వరని.. సినిమా చూసి దాని స్థితికి అనుగుణంగా రివ్యూ చెబుతానే కానీ.. ఫేక్ రివ్యూలు చెప్పనని తెలిపారు. ఇక విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియోకు మాత్రం డబ్బులు ఇచ్చారని.. కానీ దాని వల్ల తమ ఇమేజ్ పెరిగిందని తెలిపారు. దాని వల్ల తమకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందేమోనని భయపడ్డానని కానీ అలా జరగలేదన్నారు. ఇక సినిమా రివ్యూలు చెప్పే సమయంలో తనకు ఒక ఎగ్జయిట్‌మెంట్, ఉత్సాహం ఉంటాయని.. అందుకనే చాలా ఫీలవుతూ అలా రివ్యూలు చెబుతానని.. అవన్నీ ఫేక్ కాదని.. నిజమే అని తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.