Nagababu : నాగబాబు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మా ఎన్నికలు జరిగినప్పటి నుంచి నాగబాబు వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తూ వచ్చారు. ఇటీవల తన కుమార్తె నిహారిక విషయంలో ఆయన కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తన కుమార్తె తప్పు ఏమీ లేదని.. అయినా ఆమె అంత అర్థరాత్రి పూట పబ్‌కు వెళ్లడం వల్ల నిందలు మోయాల్సి వస్తుందని నాగబాబు విచారం వ్యక్తం చేశారు. కానీ కొంతకాలం పాటు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు. తరువాత షరా మామూలే అన్నట్లుగా జరుగుతుంది. అయితే సందట్లో సడేమియాలా.. నాగబాబుకు ఒక మంచి ఆఫర్ వచ్చిందనే చెప్పాలి. తాను ఎంతో కాలం నుంచి రివేంజ్ తీర్చుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైందని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి గత కొంత కాలం కిందటి వరకు నాగబాబు, రోజాలే జడ్జిలుగా ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. నాగబాబు జబర్దస్త్‌కు గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. తరువాత ఇతర టీవీ చానల్స్‌లో ఒకటి రెండు కామెడీ షోలను ప్రారంభించారు. స్వయంగా అన్నీ తానే అయి ఆ షోలను నిర్వహించారు. కానీ ఆయన అనుకున్న ఫలితం రాలేదు. జబర్దస్త్ నుంచి కొందరు కమెడియన్లను ఆయన తనతోపాటు బయటకు తీసుకెళ్లారు. కానీ ఎంత ప్రయత్నించినా.. ఆయన చేసిన షోస్ జబర్దస్త్‌కు పోటీ ఇవ్వలేకపోయాయి. అయితే అది గతం. కానీ ఇప్పుడు ఇదే షో ఆయనకు ఓ సరికొత్త అవకాశం కల్పించినట్లు అయింది.
నిన్న మొన్నటి వరకు రోజా ఉన్న కారణంగా ఈ షోను నాగబాబు టచ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఆమె లేరు. కనుక ఈ షోపై.. దాని నిర్వాహకులపై రివేంజ్ తీర్చుకునేందుకు సరైన సమయం వచ్చిందని అంటున్నారు. ఎటూ రోజా లేరు కనుక.. నాగబాబు ఇప్పుడు తాను అనుకున్న పని చేయవచ్చని.. జబర్దస్త్ పై రివేంజ్ తీర్చుకునే సమయం ఆసన్నమైందని అంటున్నారు. అదే జరిగితే జబర్దస్త్ కనుమరుగు అవడమో.. లేదా నాగబాబుకు చుక్కెదురు అవడమో జరుగుతుంది. కానీ జబర్దస్త్ షోకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదు. అందులో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఉన్నంత వరకు ఆ షోకు ఢోకా లేదు. కనుక నాగబాబు ఇప్పటికప్పుడు రంగంలోకి దిగినా జబర్దస్త్ షోను ఏమీ చేయలేరని కొందరు అంటున్నారు. అయితే ఆయన రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారని.. కనుక ఇప్పుడు సరైన సమయం లభించిందని.. కాబట్టి ఇప్పుడు ఏమైనా జరగవచ్చని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.