Actress : సినిమా పరిశ్రమలో ప్రేమల సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో అర్ధం కాదు. కొన్నాళ్లు ప్రేమ, దోమ అంటూ తిరిగి తర్వాత బ్రేకప్ అంటారు. ఇలాంటి పరిస్థితులను ఇండస్ట్రీలో మనం చాలానే చూశాం. అయితే ఇప్పుడు ఓ అందమైన హీరోయిన్.. ఓ స్టార్ హీరో ప్రేమలో పడలేదు కానీ ఆయన వలలో పడి తన కెరీర్ పాడు చేసుకుంటుందట. ఓ స్టార్ హీరోను నమ్ముకొని, తను కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతానని కలలు కంటోంది. మంచి ఆఫర్లు మిస్ చేసుకుంటోంది. టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో సరసన ఆమె నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఆ స్టార్ హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆ సినిమా రిలీజైన తర్వాత తన దశ తిరిగిపోతుందని అనుకుంటోంది సదరు హీరోయిన్. ఇంతా చేసి అందులో ఆమెది పూర్తిస్థాయి హీరోయిన్ పాత్ర కూడా కాదు. అయితే ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నా కూడా స్టార్ హీరో సినిమా వలన రిజెక్ట్ చేస్తుందట. స్టార్ హీరో సినిమా రిలీజ్ అయిన తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోతుందని.. అప్పుడు మిగతా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చేస్తానని, పారితోషికం కూడా మూడు రెట్లు చేస్తానని ఓపెన్ గా చెప్పి పంపించేస్తోంది. నిజానికి ఆ స్టార్ హీరోను నమ్ముకొని బాగుపడిన హీరోయిన్లు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలంటే అతగాడి సినిమాలతో అతడికే పేరొస్తుంది తప్ప హీరోయిన్లకు బొత్తిగా క్రేజ్ రాదు.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు మీడియం రేంజ్ హీరోల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కానీ ఆ స్టార్ హీరోను నమ్ముకొని ప్రస్తుతం చేతిలో ఉన్న ఆఫర్లను వద్దనుకుంటోంది. మరి ఈ అమ్మడికి జ్ఞానోదయం ఎప్పుడు కలుగుతుందో, ఆలోపు తనకు వచ్చే ఆఫర్స్ కూడా ఆగిపోవడం ఖాయమని కొందరు చెబుతున్నారు.