యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అందించే 12 అంకెల గుర్తింపు సంఖ్య ఆధార్ మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఆధార్‌ను నిత్యం మనం అనేక రకాలుగా వాడుతుంటాం. అయితే కొందరు ఫిజికల్ ఆధార్ కార్డును దగ్గర ఉంచుకోరు. అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఫేస్ వెరిఫికేషన్‌తో ఇ-ఆధార్‌ను వెంటనే ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు కింద తెలిపిన స్టెప్స్‌ను అనుసరించాలి.
స్టెప్ 1: UIDAI వెబ్‌సైట్ uidai.gov.in ను సందర్శించాలి.
స్టెప్ 2: అందులో హోం పేజీలో కింది భాగంలో ఉండే Get Aadhaar Card అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: ఇంకో పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ ఆధార్ కార్డు ఫేస్ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 4: ఫేస్ ఆథంటికేషన్ చేసే ముందు మొబైల్ నంబర్, కాప్చాలను ఎంటర్ చేసి కన్‌ఫాం చేయాలి.
స్టెప్ 5: తరువాత ముఖంతో ఆథెంటికేషన్ ప్రాసెస్ ప్రారంభించవచ్చు.
స్టెప్ 6: ఓకేపై క్లిక్ చేయగానే డివైస్‌కు ఉన్న కెమెరా ఆన్ అవుతుంది. దీంతో UIDAI మీ ముఖాన్ని ఆటోమేటిగ్గా కాప్చర్ చేసి ఫొటో తీస్తుంది.
స్టెప్ 7: ఫొటో క్లిక్ అయ్యి వెరిఫై అయ్యాక మీరు మీ ఇ-ఆధార్ కార్డును వెంటనే డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించవచ్చు.
ఆధార్‌ను దగ్గర ఉంచుకోని వారు ఈ విధంగా సులభంగా ఇ-ఆధార్‌ను పొందవచ్చు. ఇ-ఆధార్ దాదాపుగా అన్ని చోట్లా చెల్లుబాటు అవుతుంది. దీంతో అవసరం ఉన్న పనులను పూర్తి చేయవచ్చు.