కొందరి జీవితంలో దురదృష్టం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి దురదృష్టకరమైన జీవితమే ఈ చిన్నారిది. ఆడపిల్ల పుట్టింది అని చిన్నప్పుడే ముళ్ళ పొదల్లో తల్లిదండ్రులు వదిలితే ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తి ఈ అమ్మాయిను చేరదీసి పెంచి పెద్ద చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన పెంపుడు తండ్రి అనారోగ్యంతో మరణించాడు.తన తల్లి ఆ బిడ్డలోనే తన భర్తను చూసుకుంటూ జీవితం కొనసాగిస్తున్న నేపథ్యంలో కరోనా వారి కుటుంబం పై విషం కక్కింది. కరోనా రూపంలో ఆ తల్లిని కాటికి చేర్చడంతో ఆ బిడ్డ మరోసారి అనాధగా మిగిలిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
2010లో నెల్లూరు నగరంలో రోజుల వయసున్న ఆడ శిశువును తల్లిదండ్రులు వదిలేసి వెళ్లిపోవడంతో విషయం తెలుసుకున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ బిడ్డను చేరదీశారు.ఐతే కలెక్టరేట్లోని ఓ విభాగంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న పీలం రమణయ్య అనే వ్యక్తి ఆ పాపను చలించిపోయి తమకు పిల్లలు లేకపోవడంతో చట్టపరంగా ఆ అమ్మాయిని దత్తత తీసుకుని అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు.
పాప ఇంటికి వచ్చిన వేళా విశేషం ఏమో కాని రమణయ్యకు సూళ్లూరు పేట డీటీగా ప్రమోషన్ కూడా వచ్చింది.అత్త బాగుంది అనుకున్న క్రమంలో పాపకు రెండు సంవత్సరాలైనా మాటలు రాక పోవడంతో డాక్టర్ల దగ్గరకు తీసుకెళ్లారు. అయితే ఆ అమ్మాయి పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్యలతో పుట్టడం వల్ల తనకు మాటలు రావడం లేదు. అయినప్పటికీ రమణయ్య దంపతులు ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.
తన భార్య బిడ్డలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న క్రమంలో రమణయ్యకు అనారోగ్యం చేయడంతో మృతిచెందాడు. ఈ క్రమంలోనే తన భార్య దొరసానమ్మ తన భర్తను తన బిడ్డలో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో కరోనా వారిపై కాటు వేసింది. కరోనా బారినపడి దొరసానమ్మ మృతిచెందడంతో ఈ చిట్టి తల్లి మరోసారి అనాధగా మారింది. మొదట ఏ శిశు సంక్షేమ శాఖ నుంచి అయితే తనని దత్తత తీసుకున్నారో మళ్లీ అక్కడికే చేరింది.తల్లిదండ్రులు దూరమయ్యారంటూ గట్టిగా రోదించలేక మౌనంగా బాధపడుతోంది. కడుపులోకి కష్టాన్ని ఎవరికీ చెప్పుకోలే కన్నీళ్లను దిగమింగుతోంది.