Roja : జబర్దస్త్ జడ్జిగా, ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ విషయం గురించి అయినా కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడుతారు. అలాగే నటి జీవిత కూడా తన ఎదురుగా ఏదైనా తప్పు జరిగితే ముందు వెనక ఎవరున్నారని చూడకుండా లెఫ్ట్ రైట్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్న జీవిత, మరొక ఫైర్ బ్రాండ్ అయిన రోజాకు కౌంటర్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అసలు జీవిత.. రోజాకు కౌంటర్ వేయడానికి గల కారణం ఏమిటి.. అనే విషయానికి వస్తే..

ఏవైనా పండుగలు వస్తే ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి ఈ టీవీ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే ఉగాది పండుగ రావడంతో ఈ టీవీ వారు “అంగరంగ వైభవంగా” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో తప్పనిసరిగా రోజా హడావిడి ఉంటుంది. ఈ క్రమంలోనే అంగరంగ వైభవంగా కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా అదిరిపోయే డ్రెస్సులో రోజా డాన్స్ చేస్తూ ఎప్పటిలాగే ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటి జీవిత హాజరయ్యారు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ టీమ్ సభ్యులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే రోజా డైలాగ్ చెబుతూ.. నిన్ను చూస్తే నా నరాలు లాగేస్తున్నాయని చెప్పగానే వెంటనే జీవిత కల్పించుకుని ఏ యాంగిల్లో అమ్మా అంటూ కౌంటర్ వేశారు.
ఇలా జీవిత కౌంటర్ వేయడంతో ఒక్కసారిగా ముఖం పక్కకి తిప్పుకుని ఎక్స్‌ప్రెషన్స్ మారుస్తూ జీవితపై రివర్స్ పంచ్ వేయలేక రోజా గమ్మున ఉండిపోయారు. జబర్దస్త్ కార్యక్రమంలో అందరిపై పంచులు వేస్తూ సందడి చేసే రోజాపై జీవిత ఇలాంటి పంచ్ వేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.