Deepthi Sunaina : దీప్తి సునైనా.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్, వెబ్ సిరీస్ ద్వారా అందరికీ ఎంతో సుపరిచితమైన దీప్తి సునైనా షణ్ముఖ్ తో కలిసి ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించడమే కాకుండా వీరిద్దరూ కూడా గత కొంత కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకునే సమయానికి షణ్ముఖ్ కి బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అక్కడ షణ్ముఖ్, సిరి ఎంతో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పింది.

ఇలా షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పినప్పటి నుంచి దీప్తి సునైనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా దీప్తి సునైనా తాజాగా ఓ డాక్టర్ బాబును పడేసినట్టు తెలుస్తోంది. డాక్టర్ ఆనంద్ తో కలిసి దీప్తి సునైనా మెడలో స్టెతస్కోప్ వేసుకుని దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
ఈ ఫోటోలలో వీరిద్దరూ కలిసి ఎంతో చనువుగా దిగడమే కాకుండామై బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పక్కనే లవ్ సింబల్ పెట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి చర్చించుకునేలా చేశారు. ఇలా ఫ్రెండ్ అంటూనే అతనితో కలిసి లవ్ సింబల్ ఉన్న ఫోటోలను పెట్టడంతో దీప్తి సునైనా ఉద్దేశం ఏంటని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీప్తి సునైనా నిజంగానే అతనితో ప్రేమలో ఉందా ? లేకపోతే వీరిద్దరూ కలిసి ఏదైనా వెబ్ సిరీస్ లో నటిస్తున్నారా ? అనే సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది.