Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి గతంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపించాయి. ఈ హీరో హీరోయిన్ల మధ్య ఒక విషయం గురించి తీవ్ర స్థాయిలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని, అందుకే ప్రభాస్ ఒక పాటలో హీరోయిన్ తో కలిసి నటించడం లేదని ఏదో అలా మేనేజ్ చేశారని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా ప్రభాస్ గురించి వస్తున్న వార్తలను తన పీఆర్ టీమ్ తీవ్రంగా ఖండించింది. తన గురించి వస్తున్న ఇలాంటి వార్తలపై ప్రభాస్ప రోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అందుకే ఈ పాత్ర కోసం బాగా ఆలోచించి పూజా హెగ్డెను ఎంపిక చేశామని తెలిపారు.
ప్రేమ కథా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇలా ఈ సినిమాలో తనకు పూజా హెగ్డెకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. ప్రభాస్ ఇలా సమాధానం చెప్పడంతో పరోక్షంగా పూజా హెగ్డెతో తనకు ఏ విధమైనటువంటి మనస్పర్థలు లేవని క్లారిటీ ఇచ్చినట్లు అయింది.