ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితులలో ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు సైతం ఎవరికి తోచిన విధంగా వారు సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ క్రమంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రాశిఖన్నా కరోనా క్లిష్ట పరిస్థితులలో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
కరోనా కారణంగా ముంబై నగరంలోని ఎంతోమంది అనాథలు, బిచ్చగాళ్ళ ఆకలి కేకల తీర్చడానికి స్వచ్ఛంద సంస్థతో కలిసి వారికి ఆహారం సమకూర్చుకుంది. ఈ విధంగా ముంబై మహానగరంలో రోడ్డు పక్కన ఆపన్నహస్తం కోసం ఎదురుచూసే అనాధలను ఆదుకోవడంలో ఈనటి నిమగ్నమయ్యారు.
రాశిఖన్నా తన మంచి మనసుతో ఎంతోమంది ఆకలి తీర్చిన ఈమె ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా తన వంతు సహాయం చేస్తుంది. తను చేస్తున్న సహాయానికి ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా, తన పనిలో ఆటంకం కలగకుండా సాఫీగా సాగిపోవడానికి ప్రత్యేకంగా ఒక టీమ్ కూడా ఏర్పాటు చేసింది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఈ టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.కేవలం ఈ నటి మాత్రమే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి సేవాకార్యక్రమాలలో నిమగ్నమై పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు.