టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ అందుకు తగ్గట్టుగానే ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పడంతో అసలు వివాదం తలెత్తేది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పందించారు.
పొలిటికల్ ఎంట్రీ పై రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నాకు నేను సేవ చేసుకోవడానికి సమయం లేదు. ఇక ప్రజలకు ఏం సేవ చేస్తా.. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్నవారు మాత్రమే రాజకీయాలలోకి రావాలి. కాని ప్రస్తుతం చాలామంది వారి పలుకుబడి కోసమే రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ అంటూ మాటలు చెబుతున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.
ప్రస్తుతం రాంగోపాల్ వర్మ పొలిటికల్ ఎంట్రీ పై స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రామ్ గోపాల్ వర్మ తన గురించి చెప్పారా లేక మరెవరైనా ఉద్దేశించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అనేది తెలియక మరోసారి నెటిజన్లు సతమతమవుతున్నారు.