Tirumala Darshan Tickets : కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రత్యేక దర్శన టోకెన్లను నిర్దిష్టమైన మొత్తంలో విడుదల చేస్తున్న విషయం విదితమే. రోజూ ఒక నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టిక్కెట్లను విడుదల చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్రత్యేక దర్శన టిక్కెట్లను కూడా విడుదల చేయనున్నారు.
ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఆయా సమయాల్లో టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఇప్పటికే కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను, టీకా సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేశారు. అలిపిరి మార్గం వద్దే ఆయా పత్రాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు.