చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో ప్రత్యేక పాట రత్తాలు రత్తాలు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఈ పాటలో చిరంజీవి సరసన రాయ్ లక్ష్మి ఎంతో అద్భుతంగా నటించారు. ప్రస్తుతం ఈమెకు తెలుగులో నాయికగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సినిమాలలో ప్రత్యేక పాటకి పరిమితం అయింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రాయ్ లక్ష్మి నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈమె కేకులు కట్ చేస్తూ బర్త్ డే ,మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈమె మాత్రం ఎంజాయ్ చేస్తూ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. అందరూ ఎన్నో కష్టాలు పడుతుంటే మీరు మాత్రం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా… అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది సినిమాలు లేవని సోషల్ మీడియాలో డబ్బుల కోసం ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్లు పెడుతున్నారు.