MS Dhoni : భారత క్రికెట్ జట్టును మహేంద్ర సింగ్ ధోనీ ఎంత విజయవంతంగా నడిపించాడో అందరికీ తెలిసిందే. ధోనీ సారథ్యంలో టీమిండియా టీ20, వన్డే వరల్డ్‌కప్‌లతోపాటు ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజయం సాధించింది. ఇక అటు ఐపీఎల్‌లోనూ ధోనీ చెన్నైకి అనేక విజయాలను కట్టబెట్టాడు. 2020 ఐపీఎల్ టోర్నీలో చెన్నై పేలవమైన ప్రదర్శన చూపించినా.. 2021లో మాత్రం మరోమారు ట్రోఫీని సాధించి సత్తా చాటారు. ఇదంతా ధోనీ చలవే అని ఫ్యాన్స్ ఎవర్ని అడిగినా చెబుతారు.
అయితే వచ్చ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. దీంతో కేవలం కొద్ది మంది ప్రముఖ ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకుని మిగిలిన వారిని వేలంలో ప్రవేశపెట్టాయి. దీంతో ఈసారి 250 మంది ప్లేయర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక చెన్నై టీమ్ కూడా ఈ సారి భారీ ఎత్తున మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ధోనీ, జడేజా వంటి వారిని మాత్రమే దగ్గరే పెట్టుకోనుంది.
ఇక ఈ సారి ఐపీఎల్ లో ధోనీ ఆడుతాడని నిర్దారణ అవుతున్నా.. కెప్టెన్‌గా మాత్రం ధోనీ కొనసాగడని తెలుస్తోంది. ధోనీ తన కెప్టెన్సీని రవీంద్ర జడేజా లేదా రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ధోనీ ఓ వైపు టీమ్‌లో ఉంటూనే మరోవైపు కెప్టెన్‌గా వేరే ప్లేయర్‌ను నియమించనున్నారు. దీంతో జట్టు భవిష్యత్తులోనూ మరింత బలంగా ఉంటుందని మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది. అయితే వచ్చే ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడా.. లేదా.. అన్నది తెలియాల్సి ఉంది.