టి-రెక్స్ ప్రొ పేరిట అమేజ్‌ఫిట్ భారత్‌లో ఓ నూతన స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. ఈ వాచ్ మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలను, నాణ్యతను కలిగి ఉంది. 70 డిగ్రీల సెంటీగ్రేడ్ గరిష్ట ఉష్ణోగ్రతతోపాటు -40 డిగ్రీల సెంటీగ్రేడ్ కనిష్ట ఉష్ణోగ్రతలోనూ ఈ వాచ్ పనిచేస్తుంది. దీనికి షాక్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. అతి శీతల, అతి ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని పనిచేసేలా ఈ వాచ్‌ను రూపొందించారు. ఇందులో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ వ్యవస్థ కూడా ఉంది.
టి-రెక్స్ ప్రొ స్మార్ట్ వాచ్‌లో 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇందులో జీపీఎస్ ఫీచర్ ఉంది. 40 గంటల పాటు నిరంతరాయంగా ఈ వాచ్‌లో జీపీఎస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ వాచ్ 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. ఇందులో 100 రకాలకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందిస్తున్నారు. 10 ఏటీఎం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉంది. బయో ట్రాకర్ పీపీజీ ఆప్టికల్ సెన్సార్‌ను ఏర్పాటు చేసినందున నిరంతరాయంగా హార్ట్ రేట్‌ను తెలుసుకోవచ్చు.
అమేజ్‌ఫిట్ టి-రెక్స్ ప్రొ ఫీచర్లు
- 1.3 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 360 x 360 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్‌లకు కనెక్టివిటీ
- ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ మీజర్‌మెంట్
- బారోమెట్రిక్ ఆల్టీమీటర్ సెన్సార్, డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్
- బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎంఐఎల్-ఎస్‌టీడీ 810జి ప్రమాణాలు
- 100 రకాలకు పైగా స్పోర్ట్స్ మోడ్స్
- 390 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్
అమేజ్‌ఫిట్ టి-రెక్స్ ప్రొ (Amazfit T-Rex Pro) స్మార్ట్ వాచ్ మీటియోరైట్ బ్లాక్, డిజర్ట్ గ్రే, స్టీల్ బ్లూ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ వాచ్ రూ.12,999 ధరకు లభిస్తోంది. దీన్ని అమెజాన్‌తోపాటు అమేజ్‌ఫిట్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు.