మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 57,640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులో 920 మంది చనిపోయారు. ఈ క్రమంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఆ రాష్ట్రంలో 48,80,542కు చేరుకుంది. 72,662 మంది ఇప్పటి వరకు చనిపోయారు. ఏప్రిల్ 28వ తేదీ తరువాత ఒకే రోజు ఇంత ఎక్కువ స్థాయిలో మరణించడం ఇది రెండోసారి. ఆ రోజు 985 మంది చనిపోయారు.
ఇక మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో 2,79,200 మందికి పరీక్షలు నిర్వహించారు. 41,64,098 మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో 57,006 మంది డిశ్చార్జి అయ్యారు. మంగళవారం ఆ రాష్ట్రంలో 51,880 కోవిడ్ కేసులు నమోదు కాగా 891 మంది చనిపోయారు. సోమవారం 48,621 కేసులు నమోదయ్యాయి. 567 మంది చనిపోయారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో బుధవారం కొత్తగా 3,882 కరోనా కేసులు నమోదు కాగా 77 మంది చనిపోయారు. ఈ క్రమంలో ముంబైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,65,057కు చేరుకుంది. 13,511 మంది చనిపోయారు. మంగళవారం ముంబైలో 2,554 కేసులు నమోదు కాగా, 62 మంది చనిపోయారు.