ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహించనుంది. మే 2 నుంచి 7వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో వినియోగదారులు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తగ్గింపు ధరలకు పొందవచ్చు. శాంసంగ్ ఫోన్లపై భారీ స్థాయిలో రాయితీలను అందివ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. అలాగే యాపిల్, వివో, అసుస్, షియోమీ వంటి కంపెనీలకు చెందిన ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందివ్వనున్నారు.
ఇక ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు, యాక్ససరీలు, టీవీలపై 75 శాతం వరకు ఈ సేల్‌లో రాయితీలను అందివ్వనున్నారు. సేల్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62, ఎఫ్41, ఎఫ్12, ఐఫోన్ 11, అసుస్ ఆర్‌వోజీ ఫోన్ 3, ఐక్యూ 3, ఎంఐ 10టి సిరీస్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, ల్యాప్ టాప్‌లు, పవర్ బ్యాంకులపై రాయితీలను అందివ్వనున్నారు.
అలాగే స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు రాయితీలను అందిస్తారు. స్మార్ట్ వాచ్‌లు, హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లపై 70 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు రాయితీలను అందిస్తారు. వన్ ప్లస్‌కు చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీని రూ.14,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.