Akhanda : బోయపాటి శ్రీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. అఖండ. ఇందులో బాలకృష్ణ భిన్నమైన గెటప్‌లో కనిపించనున్నారు. ఈ మూవీకి చెందిన టీజర్, పోస్టర్, ఇటీవల విడుదల చేసిన సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ మూవీని డిసెంబర్ 2న విడుదల చేయాలని భావిస్తున్నారు. కానీ మూవీ విడుదలకు ముందే రూ.20 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.
అఖండ మూవీకి రూ.70 కోట్ల బడ్జెట్ అని ముందుగా అనుకున్నారట. కానీ అది కాస్తా రూ.80 కోట్లకు చేరుకుందని టాక్ వినిపిస్తోంది. బోయపాటి వల్లే ఈ విధంగా జరిగిందని చర్చించుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ తో అయితే ఇంకా తక్కువ బడ్జెట్‌తోనే ఆయన మూవీని తీసి ఉండేవారని అంటున్నారు.
ఈ విధంగా బడ్జెట్ పెరిగిపోవడంతో రూ.10 కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో టిక్కెట్ల ధరల తగ్గింపు కారణంగా నిర్మాతకు ఈ మూవీకి గాను రూ.10 కోట్ల మేర టేబుల్ లాస్ వచ్చిందని అనుకుంటున్నారు. అంటే.. మొత్తం రూ.20 కోట్లు నష్టం అన్నమాట. ఇలా విడుదలకు ముందే ఈ మూవీ నష్టం బారిన పడిందని చర్చించుకుంటున్నారు. మరి ఏపీలో టిక్కెట్ల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసకుంటారో చూడాలి.