టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో “లవ్ స్టోరీ” సినిమా చేశారు. ఈ సినిమా తరువాత నాగచైతన్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే చిత్రాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర బృందం తాజా షెడ్యూల్ కోసం ఇటలీలో వాలిపోయారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం మాత్రం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎందరో స్టార్ హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకోగా నాగచైతన్య మాత్రం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలో నాగచైతన్య సరసన హీరోయిన్ రాశి కన్నా నటించనున్నారు. ప్రస్తుతం రాశి కూడా ఇటలీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు వరుస ఫ్లాప్ లను చూసిన విక్రమ్ కే కుమార్ “థాంక్యూ” చిత్రం ద్వారా విజయాన్ని అందుకోవాలని పక్కా ప్లాన్ తో ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నాగచైతన్య ఇదివరకు నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉండగా కరోనా ప్రభావం వల్ల వాయిదా పడింది.