కరోనా బారిన పడి హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్న వారికి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఈ ఇంజెక్షన్ ధరను ఇటీవలే భారీగా తగ్గించింది. అయినప్పటికీ కొందరు లాభాపేక్షతో బ్లాక్ మార్కెట్‌లో ఈ ఇంజెక్షన్‌ను భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఇంజెక్షన్ అసలు ధర రూ.899 నుంచి రూ.5400 మధ్య ఉంది. కానీ కొందరు దీన్ని రూ.20వేల నుంచి రూ.30వేల వరకు విక్రయిస్తున్నారు.
అయితే అంత మొత్తం వెచ్చించినా అసలైన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కు బదులుగా నకిలీ ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారని వెల్లడైంది. ఈ క్రమంలోనే అసలు, నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌లను ఎలా గుర్తించాలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ మోనికా భరద్వాజ్ వెల్లడించారు. ఈ మేరకు ఆమె అసలు, నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల మధ్య తేడాలను ఫొటోల ద్వారా వివరించారు. వాటిని ఆమె ట్విట్టర్‌లో షేర్ చేశారు.
అసలు, నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల మధ్య తేడాలివే
1. నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ప్యాక్‌పై Rx అనే పదం ఉండదు.
2. అసలైన ఇంజెక్షన్ ప్యాక్ మీద 100 mg/Vial అని ఉంటుంది. నకిలీ ఇంజెక్షన్ ప్యాక్‌లపై 100 mg/vial అని ఉంటుంది.
3. అసలైన ప్యాక్ మీద COVIFOR అనే బ్రాండ్ పేరు మధ్యలో ఉంటుంది. కానీ నకిలీ ఇంజెక్షన్ ప్యాక్‌పై ఈ బ్రాండ్ పేరు అలైన్‌మెంట్ సరిగ్గా ఉండదు. ఏదో ఒక వైపుకు జరిగినట్లు ఉంటుంది.
4. నకిలీ ప్యాక్ వెనుక భాగంలో బ్రాండ్ పేరులో క్యాపిటలైజేషన్ ఎర్రర్ ఉంటుంది. చిన్న అక్షరాలతో బ్రాండ్ నేమ్ ప్రారంభం అవుతుంది.
5. అసలైన ప్యాక్ మీద వార్నింగ్ లేబుల్ ఎరుపు రంగులో ఉంటుంది. అదే నకిలీ అయితే ఆ లేబుల్ నలుపు రంగులో ఉంటుంది.
6. వార్నింగ్ లేబుల్ కింద ముఖ్యమైన సమాచారం మిస్ అయింది. ఫేక్ ప్యాక్‌పై ఇలా ఉంటుంది.
7. ఫేక్ ఇంజెక్షన్ ప్యాక్‌పై మెడిసిన్ ఉత్పత్తిదారు పేరు తప్పుగా ఉంటుంది.
https://twitter.com/manabhardwaj/status/1386578612707643393