Sana : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని విలక్షణమైన పాత్రల్లో కూడా నటించి పేరు తెచ్చుకుంటున్న వారు ఉన్నారు. అలాంటి వారిలో సన కూడా ఒకరు. ఎన్నో పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరెన్నో పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
సిల్వర్ స్క్రీన్ పై తనకంటూ అభిమానాన్ని సంపాదించుకున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా బుల్లితెరపై కూడా నటించారు. సినీ ఇండస్ట్రీ అంటేనే ముళ్ళ పాన్పు. ఏ ఒక్కరికీ ప్రశాంతమైన జీవితం గడవదు, అదే జీవితం. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి వెళ్ళిన సనకు కూడా కష్టాలు తప్పలేదు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు, సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రముఖ టీవీ ఛానల్ లో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో సన తన జీవితంలో జరిగిన ఎన్నో చేదు అనుభవాలను తెలియజేశారు. అలాగే తను కష్టాల్లో ఉన్నప్పుడు కూడా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ఆమెకు సహాయం చేశారని తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆలీ హోస్ట్ గా వ్యవహరించారు.
సినీ ఇండస్ట్రీలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా అని అడిగితే ఆ సంఘటనలను గుర్తు తెచ్చుకొని సన ఎమోషనల్ అయ్యారు. తను సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎంతోమంది మోసం చేశారని తెలిపారు. అందర్నీ నమ్మడం తన బలహీనత అని అన్నారు. అలా తనను ఎంతో ఇబ్బంది పెట్టిన సమస్యల్ని తెలిపారు. ప్రస్తుతం బుల్లితెరపై నటిస్తూ బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం సన యాక్టివ్ గా ఉంటారు. అలాగే ఓ యూట్యూబ్ చానల్ లోనూ కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.