ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, కరోనా బారిన పడిన వారికి చికిత్స అందించడం, మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్, మందుల సరఫరా రాష్ట్రాలకు భారంగా మారుతున్నాయి.ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల నుంచి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం టీకా కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ క్రమంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటైన సెరమ్ ఇన్సిట్యూట్ ఒక డోసు వ్యాక్సిన్ కి రూ.400 లుగా నిర్ణయించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి భారం అయినప్పటికీ పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేయడానికి సిద్ధపడి టీకాలను ఆర్డర్ ఇస్తున్నాయి.
రాష్ట్రాలకు వ్యాక్సిన్ కొనుగోలు విషయంలో అధిక భారం పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాటిని రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను రూ.150లు చొప్పున కేంద్రం ఉత్పత్తి కంపెనీల నుండి కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది.