దేశవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు శాంసంగ్ శుభవార్త చెప్పింది. శాంసంగ్‌కు చెందిన ఫోన్లు, ట్యాబ్‌లను వాడేవారు వాటిని రిపేర్ చేయించాల్సి వస్తే ఇకపై సర్వీస్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఆ కంపెనీ వారే వచ్చి డివైస్‌లను తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్లీ వాటిని డెలివరీ చేస్తారు. ఈ క్రమంలోనే శాంసంగ్ ఈ కార్యక్రమానికి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్‌గా పేరు పెట్టింది. ఇందులో భాగంగా రెండు రకాల సేవలు వినియోగదారులకు లభిస్తాయి.
కస్టమర్లు తమ శాంసంగ్ ఫోన్ లేదా ట్యాబ్ ను సర్వీస్ సెంటర్‌లో ఇచ్చి డెలివరీ ఆర్డర్ పెట్టవచ్చు. అంటే కేవలం డ్రాప్ మాత్రమే అన్నమాట. ఇందుకు రూ.99 ఫీజు తీసుకుంటారు. ఇక ఫోన్‌ను తీసుకెళ్లి రిపేర్ చేసి తీసుకొస్తే పికప్ అండ్ డ్రాప్ కింద రూ.199 తీసుకుంటారు. ఈ క్రమంలోనే శాంసంగ్ గెలాక్సీ ఎ, గెలాక్సీ ఎమ్, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎఫ్, గెలాక్సీ నోట్, గెలాక్సీ ఫోల్డ్ సిరీస్ ఫోన్లు, గెలాక్సీ ట్యాబ్‌లను వాడేవారు ఈ సేవను ఉపయోగించుకోవచ్చు.
ఇక ప్రస్తుతం శాంసంగ్‌కు చెందిన పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ పలు ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లోనే అందుబాటులో ఉంది.
ఢిల్లీ, గుర్గావ్, ముంబై, కోల్‌కతా, చెన్నై, పూణె, బెంగళూరు, అహ్మదాబాద్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, చండీగఢ్, లూథియానా, జలంధర్, జైపూర్, ఉదయ్‌పూర్, జోధ్ పూర్, ఆగ్రా, లక్నో, వారణాసి, డెహ్రాడూన్, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, దుర్గాపూర్, రాంచీ, థానె, ఔరంగాబాద్, కోల్హాపూర్, నాగ్‌పూర్, సూరత్, వడోదర, భోపాల్, ఇండోర్, రాయ్‌పూర్, రాజ్‌కోట్, జబల్‌పూర్, కోయంబత్తూర్, మదురై, కొచ్చి, కాలికట్, తిరుపతి, హుబ్లి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో ఈ సేవ అందుబాటులో ఉంది.
కరోనా వల్ల చాలా మంది బయటకు రావడానికే భయపడుతున్నారని, అలాంటి పరిస్థితిలో తాము అందిస్తున్న ఈ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని శాంసంగ్ ఇండియా కస్టమర్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ సునీల్ కుటిన్హా వెల్లడించారు.