Anasuya : గత కొద్ది రోజులుగా తీవ్ర ఉత్కంఠతో కొనసాగిన మా ఎన్నికలకు ఎట్టకేలకు తెరపడి ఫలితాలు వచ్చాయి. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొంది సంచలనం సృష్టించారు. దీంతో నాగబాబు, ప్రకాష్ రాజ్‌లు మా సభ్యత్వానికి రాజీనామాలు కూడా చేశారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన అనసూయ తన సోషల్ ఖాతాల్లో షాకింగ్ కామెంట్లు చేసింది.
ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో అనసూయ ఈసీ మెంబర్‌గా పోటీ చేసి గెలుపొందింది. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ గెలవకపోవడంతో ఆమెతోపాటు గెలిచిన ఇతర సభ్యులకు విచారంగా ఉంది. అయితే అనసూయ తన సోషల్ ఖాతాల్లో చేసిన పోస్ట్‌లు షాకింగ్‌గా మారాయి. నిజానికి ఆమె గెలిచిందని ఆదివారం రాత్రి ప్రకటించారు. కానీ తెల్లారేసరికి ఆమె ఓడిపోయిందని చెప్పారు. దీనిపై కూడా అనసూయ పోస్టు పెట్టడం విశేషం.
Ok. Lesson learnt. 😊 pic.twitter.com/2PSFh2AlMW
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
తాను ఇకపై ఎప్పటికీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని.. రాజకీయాల్లో ఉంటే నిజాయితీగా ఉండలేమని.. అందుకు తనకు సమయం కూడా లేదని.. తనకు తన పిల్లల భవిష్యత్తే ముఖ్యమని.. అనసూయ తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. అలాగే తాను గుణపాఠం నేర్చుకున్నానని కూడా అందులో కామెంట్ పెట్టింది. దీంతో ఆమె మా ఎన్నికలను ఉద్దేశించే వ్యాఖ్యలు చేసిందని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
😂 Kshaminchali.. okka vishayam gurtochi tega navvochestundi.. meeto panchukuntunna emanukovoddey..! Ninna “athadhika majority” “bhaari majority” to gelupu ani.. eeroju “lost” “otami” antunnaru.. raathriki raathri enjaruguntundabba🧐 🤔
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
Asalu unna sumaru 900 voters lo sumaru 600 chillara voters lekkimpuki rendo roju ki vaayida veyalsinanta time eduku pattindantaru?? Aha edu ardhamkaka adugutunnanu.. 🧐🤔
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 11, 2021
నిజానికి అనసూయ అంటే చాలా మంది అభిమానిస్తారు. కానీ ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో ఈసీ మెంబర్‌గా పోటీ చేయడం వల్ల కొందరికి దూరం అయిందని చెప్పవచ్చు. అందువల్లే ఆమె విచారంగా ఈ పోస్టు పెట్టిందని తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో గెలిచిన వారు రాజీనామాలు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి వారు ఏం చేస్తారో చూడాలి..!