పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ గత కొద్దిరోజుల నుంచి తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక బాలీవుడ్ సినిమా క్లిప్పింగ్ పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు ఓ రేంజ్ లో ఇమ్రాన్ ఖాన్ ని ఆడుకున్నారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు కూడా పెద్ద ఎత్తున ఈ వీడియో పై స్పందించడంతో వెంటనే ఇమ్రాన్ ఖాన్ డిలీట్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ ఈ వీడియోను డిలీట్ చేసినప్పటికీ జర్నలిస్ట్ నైనా ఇనాయత్ ఆ వీడియోను క్యాప్చర్ చేసి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు ఇమ్రాన్ ఖాన్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో అమితాబచ్చన్ నటించిన ఇంక్విలాబ్‌లోని సీన్ ఇది.
*Good Bollywood* to the rescue of PM Imran Khan. ??♀️https://t.co/VOC9rissT8 pic.twitter.com/qFjfcpUex6
— Naila Inayat (@nailainayat) April 20, 2021
ఈ వీడియో క్లిప్పింగ్ లో అధికారంలో ఉన్న పార్టీని ఏవిధంగా పడగొట్టాలని విలన్ పార్టీ నేతలకు చెబుతుంటాడు. దేశంలో అల్లర్లు సృష్టించి,ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చెబుతాడు.అచ్చం ఇదేవిధంగా పాకిస్థాన్ లో కూడా తన ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందంటూ ఇమ్రాన్ ఖాన్ షేర్ చేసిన ఈ వీడియో పైపలువురు నెటిజన్లు స్పందించి ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలను ఎంతో హేళన చేసిన మీరు ఇప్పుడు ఏ విధంగా బాలీవుడ్ సినిమా వీడియోలను వాడుకుంటున్నారు అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు కురిపిస్తున్నారు