Viral News : సాధారణంగా ఎవరైనా వాంతి చేసుకుంటున్నారంటే మనం అక్కడి నుంచి పరుగులు పెడతాము. అయితే ఓ మత్స్యకారుడిని ఆ వాంతి ఏకంగా కోటీశ్వరుడిని చేసింది. వాంతి అంటే మనం చేసుకునేది కాదండోయ్.. తిమింగలం వాంతి.. దాని ద్వారా ఓ మత్స్యకారుడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడుగా మారాడు. ఈ ఘటన థాయ్లాండ్ లో చోటు చేసుకుంది. థాయిలాండ్ కు చెందిన నారోంగ్ ఫేచరాజ్ అనే మత్స్యకారుడు రోజూ చేపల వేటకు వెళుతూ రూ.20వేల వరకు సంపాదించేవాడు.
అయితే ఒకరోజు నారోంగ్ ఫేచరాజ్ సూరత్ థానీ ప్రాంతంలోని నియోమ్ బీచ్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో అతనికి సముద్ర తీరంలో ఒక వింతైన వస్తువు కనిపించింది. ఈ క్రమంలోనే అక్కడికి వెళ్లిన అతను దానిని తీసుకొని అధికారులకు అప్పగించి ఎంతో కొంత డబ్బును వారి నుంచి పొందాలని భావించాడు. దానిని సోంగ్లా యూనివర్సిటీ అధికారులకు అప్పగించగా వారు దానిని పరిశీలించి ambergrisగా గుర్తించారు.
మగ తిమింగలం తిన్న పదార్థాలు జీర్ణం చేసుకోలేక వాంతి చేసుకున్న దానిని ambergrisగా పిలుస్తారు. అయితే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని వివిధ రకాల పర్ఫ్యూమ్స్ తయారీలో ఉపయోగించడం వల్ల దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఇలా ఆ మత్స్యకారుడి దొరికిన 30 కిలోల ambergris కు రూ.10 కోట్లు వచ్చాయి. దీంతో అతను రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.