మొబైల్స్ తయారీదారు ఒప్పో.. ఎ54 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో 6.51 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో హీలియో పి35 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌లను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ లభిస్తుంది. వెనుక వైపు 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా మరో 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను పక్క భాగంలో అమర్చారు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నారు.
ఒప్పో ఎ54 ఫీచర్లు
- 6.51 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 ×720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
- 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 10
- 13, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా
- ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
- బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్
ఒప్పో ఎ54 స్మార్ట్ ఫోన్ క్రిస్టల్ బ్లాక్, స్టారీ బ్లూ, మూన్‌లైట్ గోల్డ్ వేరియెంట్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,490 ఉండగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,490గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.15,990గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాలు అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తున్నారు.
ఇక ఫోన్ లాంచింగ్ సందర్భంగా దీనిపై ఆఫర్లను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఉచిత మొబైల్ ప్రొటెక్షన్‌ను అందిస్తారు. కేవలం రూ.1కే 70 శాతం బై బ్యాక్ వాల్యూ ఇస్తారు. 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం లభిస్తోంది. ఇక రిటెయిల్ ఔట్‌లెట్లలో హెచ్‌డీఎఫ్‌సీ, స్టాండర్డ్ చార్టర్డ్, కోటక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు. పేటీఎం నుంచి 11 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. జీరో డౌన్ పేమెంట్ ద్వారా ఫోన్‌ను కొనవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం అందిస్తారు.