Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దాల నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ స్పందించని వెంకీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే వెంకటేశ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారాపెట్టిన కొటేషన్స్ చదివితే ఎవరికైనా సమంత, చైతన్య విడాకుల విషయం గురించే పెట్టారన్న విషయం చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంతకీ ఆ స్టోరీలో ఏముంది అనే విషయానికి వస్తే.. “నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర కూడా తెరవాలనే” కొటేషన్ ను వెంకటేష్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో తెలియజేశారు.
ప్రస్తుతం ఈ కొటేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత, నాగచైతన్య విడాకుల గురించి వస్తున్న రూమర్ల గురించి వెంకటేష్ ఈ విధంగా స్పందించారని చెప్పవచ్చు. ఇకపోతే నాగచైతన్య వెంకటేష్ సోదరి కుమారుడు కావడంతో నాగచైతన్య, సమంత విడాకుల విషయం అటు అక్కినేని కుటుంబానికి, ఇటు దగ్గుబాటి ఫ్యామిలీకి మింగుడు పడలేదని చెప్పవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే నారప్ప సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ త్వరలోనే దృశ్యం 2, ఎఫ్ 3 ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.